Shahnaaz Sayyad: బుకింగ్ క్యాన్సిల్ చేసిందని మహిళపై థెరపిస్ట్ దాడి.. వీడియో ఇదిగో!
- ముంబైలో మసాజ్ బుకింగ్ క్యాన్సిల్ చేసినందుకు మహిళపై దాడి
- థెరపిస్ట్ ప్రవర్తన, పరికరాలతో అసౌకర్యంగా భావించి సర్వీస్ రద్దు
- నిందితురాలిపై నాన్-కాగ్నిజబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు
- థెరపిస్ట్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించిన అర్బన్ కంపెనీ
ఆన్‌లైన్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న మసాజ్ సర్వీస్‌ను రద్దు చేసుకున్నందుకు ఓ మహిళపై థెరపిస్ట్ దాడికి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముంబైలోని వడాలా ప్రాంతంలో నివసించే 46 ఏళ్ల షహనాజ్ సయ్యద్, ‘అర్బన్ కంపెనీ’ యాప్ ద్వారా తన ఫ్రోజెన్ షోల్డర్ సమస్యకు చికిత్స కోసం మసాజ్ సర్వీస్ బుక్ చేసుకున్నారు. బుధవారం సాయంత్రం 4:30 గంటలకు మహిళా థెరపిస్ట్ ఆమె ఇంటికి వచ్చింది. అయితే, ఆ థెరపిస్ట్ ప్రవర్తనతో షహనాజ్ అసౌకర్యంగా భావించారు. అంతేకాకుండా, మసాజ్ కోసం తెచ్చిన బెడ్ గదిలో పట్టకపోవడం, ప్రైవసీ సమస్యలు తలెత్తడంతో ఆమె బుకింగ్‌ను రద్దు చేసుకున్నారు.
యాప్‌లో రిఫండ్ ప్రాసెస్ చేస్తుండగా థెరపిస్ట్ ఆగ్రహంతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి షహనాజ్‌పై దాడి చేసింది. ఆమె జుట్టు పట్టుకుని లాగి, ముఖంపై పిడిగుద్దులు కురిపించి, గోళ్లతో రక్కినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అడ్డుకోబోయిన తన 18 ఏళ్ల కుమారుడిని కూడా తోసివేసిందని తెలిపారు.
ఈ ఘటనపై షహనాజ్ వడాలా టీటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు థెరపిస్ట్‌పై నాన్-కాగ్నిజబుల్ (NC) కేసు నమోదు చేశారు. ఈ తరహా కేసుల్లో కోర్టు ఆదేశాలు లేకుండా తాము అరెస్టు చేయడం గానీ, దర్యాప్తు కొనసాగించడం గానీ చేయలేమని, తదుపరి చర్యల కోసం బాధితురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై స్పందించిన అర్బన్ కంపెనీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న థెరపిస్ట్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు ప్రకటించింది.