రిలయన్స్‌ సూపర్‌మార్కెట్లు, పెట్రోల్‌ బంకులను తగలబెట్టమని చెప్పింది మీరు కాదా?: వర్ల రామయ్య

  • సత్వానీకి రాజ్యసభ సీటు ఎందుకివ్వాలనుకుంటున్నారు?
  • మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోండి
  • నత్వానీ ఎవరు? ఆయన ఎక్కడి వారు? ఎక్కడి నుంచి వచ్చారు 
  • మీ నాన్నగారు చనిపోతే రిలయన్స్‌ వారే  కారణమని మీరన్నది నిజంకాదా?
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ నత్వానీకి  ఏపీ నుంచి వైసీపీ తరఫున రాజ్యసభ టికెట్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.

ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'మీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోండి. నత్వానీ ఎవరు? ఆయన ఎక్కడి వారు? ఎక్కడి నుంచి వచ్చారు. అంబానీ మీ ఇంటికి వస్తే స్వాగతం ఎందుకు పలికారు? ఆనాడు మీ నాన్నగారు చనిపోతే రిలయన్స్‌ వారే ఇందుకు కారణమని మీరన్నది నిజంకాదా?' అని ప్రశ్నించారు.

'రిలయన్స్ వారే చంపించారని ఆరోపిస్తూ కోట్లాది రూపాయల రిలయన్స్‌ ఆస్తులు ధ్వంసం చేయడానికి యత్నించింది మీరు కాదా? రిలయన్స్‌ ఆస్తులు ధ్వంసం చేయమని సందేశాలు పంపించింది మీరు కాదా? రిలయన్స్‌ సూపర్‌మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు తగలబెట్టమని చెప్పింది మీరు కాదా? ఆ కేసుల్లో అరెస్టైన వారిలో 90 శాతం మంది దళితులే. వారు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు' అని రామయ్య పేర్కొన్నారు.

Varla Ramaiah
Telugudesam
Jagan
YSRCP

More Telugu News