అమృత, ప్రణయ్‌ల సంచలన ప్రేమ కథ ఆధారంగా సినిమా.. టైటిల్ ఖరారు
- కొత్త దర్శకుడు శివనాగేశ్వర్ రావు దర్శకత్వం
- బాలాదిత్య, అర్చన జంటగా సినిమా
- ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ పేరుతో సినిమా
ఇందులో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజతో పాటు బాలాదిత్య, అర్చన నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుందని బాలాదిత్య మీడియాకు తెలిపాడు. నిజజీవిత కథతో పాటు కొంత కల్పిత కథను కూడా చేర్చి ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలాదిత్య సరసన అర్చన నటిస్తోంది. ఈ సినిమాకి ఎంఎన్‌ఆర్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ అనే పేరును ఖరారు చేశారు.