Rama Subba Reddy: వైసీపీలో చేరబోతున్నారనే వార్తలపై టీడీపీ నేత రామసుబ్బారెడ్డి స్పందన

కడప జిల్లాలో టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. ఇప్పటికే వైసీపీ నేతలు ఆయనతో చర్చించారని, త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారనే వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగులో మీడియాతో మాట్లాడుతూ, తాను ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నానని చెప్పారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి ఇదే పార్టీలో ఉన్నామని... తన చిన్నాన్న శివారెడ్డి హయాం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ధైర్యంగా ముందుకు సాగుతున్నామని రామసుబ్బారెడ్డి తెలిపారు. తన ప్రమేయం లేకుండానే వైసీపీలో చేరుతున్నట్టు కొన్ని చానళ్లు ప్రసారం చేయడం అన్యాయమని చెప్పారు. ఒకవేళ పార్టీ మారే ఆలోచన ఉంటే అందరికీ చెప్పే ఆ పని చేస్తానని తెలిపారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.
Rama Subba Reddy
Jammalamadugu
Telugudesam
YSRCP

More Telugu News