'శీనయ్య' ప్రాజెక్టు ఆగిపోలేదట
- మాస్ డైరెక్టర్ గా వినాయక్ కి మంచి క్రేజ్
- 'శీనయ్య'తో కథానాయకుడిగా ఎంట్రీ
- తదుపరి షెడ్యూల్ కి సన్నాహాలు
'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి నరసింహారావు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కొంతవరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. ఆ తరువాత అవుట్ పుట్ పట్ల వినాయక్ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, ప్రాజెక్టు ఆగిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్టు ఆగిపోలేదట. ఒక వైపున స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతూనే, మరో వైపున షూటింగును తిరిగి ఆరంభించాలనే నిర్ణయానికి 'దిల్' రాజు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ నెల 19 లేదా 20వ తేదీల్లో ఈ సినిమా షూటింగు తిరిగి ప్రారంభం కానున్నట్టుగా సమాచారం.