ప్రభాస్ 21వ సినిమా కాన్సెప్ట్ ఇదేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ 21వ సినిమా కాన్సెప్ట్ ఇదేనా?

Intresting Update Over Prabhas New Movie
  • దర్శకత్వం వహించనున్న నాగ్ అశ్విన్
  • థర్డ్ వరల్డ్ వార్ కాన్సెప్ట్ తో చిత్రం
  • వచ్చే సంవత్సరం చివర్లో రిలీజ్!
ప్రభాస్ నటించిన 17, 18 సినిమాలు 'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్ క్లూజన్' తరువాత 19వ సినిమాగా 'సాహో' చేశాడు. 20వ సినిమా ఇప్పుడు సెట్స్ పై ఉండగానే, 21వ చిత్రాన్ని 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తో చేయనున్నానని ప్రకటించేశాడు కూడా. వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ ఈ సినిమాకు నిర్మాతకాగా, డిసెంబర్ లో షూటింగ్ ను ప్రారంభించి, 2021 చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, చిత్ర కాన్సెప్ట్ పై ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ లో జరుగుతూ ఉంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫ్యూచరిస్టిక్ జోనర్ లో ఉంటుందట. మూడవ ప్రపంచ యుద్ధమే వస్తే పరిస్థితి ఏంటన్న కోణంలో స్టోరీ ఉంటుందని పలువురు చెబుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
Prabhas
Nag Ashwin
21st Movie
Update
Tollywood

More Telugu News