విశాఖలో బలవంతపు భూసేకరణ జరుగుతోంది: నాదెండ్ల మనోహర్ ఆరోపణ
- బాధిత రైతులకు తమ పార్టీ అండగా ఉంటుంది
- విశాఖలో బాబును అడ్డుకున్న ఘటనలో పోలీసుల తీరు దారుణం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తాం
కాగా, ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన సమావేశాలు ప్రారంభమయ్యాయి. విశాఖపట్టణంలో ప్రారంభమైన ఈ సమావేశాల్లో జనసేన నేత, పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సమావేశాలకు వేదిక అయిన నోవాటెల్ హోటల్ వరకు కార్లు, బైక్ లతో ర్యాలీగా నాదెండ్ల వెంట వెళ్లారు.