ఉగ్రముఠాలను అణచివేయాలి.. పాకిస్థాన్‌కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన
- పహల్గామ్‌లో మతాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేశారన్న బ్రాడ్ షెర్మన్
- లష్కరే, జైషే వంటి ఉగ్రవాద సంస్థలను పాకిస్థాన్ అణచివేయాలని సూచన
- అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని ఆవేదన
గత సంవత్సరం భారతదేశంలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు సంబంధం ఉందని, ఆ ఉగ్రముఠాలను పాకిస్థాన్ అణచివేయాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ అన్నారు. భారతీయ ఎంబసీ 'హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం' పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం వల్ల ప్రజలకు కలుగుతున్న నష్టాల గురించి బ్రాడ్ షెర్మన్ మాట్లాడారు.
పహల్గామ్ ఉగ్రదాడిని గుర్తు చేస్తూ, అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారని అన్నారు. మతాన్ని దృష్టిలో పెట్టుకుని దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రభుత్వానికి తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని, పహల్గామ్ ఉగ్రదాడితో సంబంధం ఉన్న ఉగ్ర సంస్థలను అణచివేయాలని పిలుపునిచ్చారు.
అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడుతూ, మనమందరం కొన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. ఉగ్రవాదం మన సమాజానికి అపార నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఒక్కటై ఐకమత్యంతో మెలగాలని పిలుపునిచ్చారు.
ఈ డిజిటల్ ఎగ్జిబిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అతిపెద్ద ఉగ్రవాదులను ప్రదర్శించారు. 1993లో జరిగిన బాంబు పేలుళ్లు, 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడి, పహల్గామ్ దాడికి సంబంధించిన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. ఉగ్రవాదం అనే భూతాన్ని ప్రపంచం నుంచి పారద్రోలాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పిలుపునిచ్చారు.