బాబ్లీపై అఖిల పక్షం భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబ్లీపై అఖిల పక్షం భేటీ

బాబ్లీ అంశంపై సచివాలయంలో అఖిలపక్షం సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి సుదర్శన్ రెడ్డి. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, తుమ్మల నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నుంచి వినోద్, సీపీఐ నుంచి నారాయణ, చాడ వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ నుంచి గట్టు, కేకే మహేందర్ రెడ్డి హజరయ్యారు.

ఈ సమావేశంలో ప్రాజెక్టు విషయంలో చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించనున్నారు. బాబ్లీ విషయంలో మహరాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో కొన్ని వివాదాలు ఉన్న విషయం తెలిసిందే, సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. తాజాగా బాబ్లీపై మరిన్ని ప్రాజెక్టులు కట్టేందుకు ఇతర రాష్ట్రాలు ప్రయత్నిస్తుండడంతో మనరాష్ట్రంలో వ్యవసాయానికి నీరు సరఫరా చెయ్యలేని పరిస్థితి నెలకొంది దీంతో అఖిలపక్షంలో ఇతర రాష్ట్రాలతో చర్చలకి వెళ్లాలా? లేక న్యాయపోరాటం చెయ్యాలా? అంటూ చర్చిస్తున్నారు.

More Telugu News