కాబోయే భార్య గొంతును కోసిన యువకుడు

boy attacked girl in odisha
  • ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లాలో ఘటన
  • కొన్ని రోజుల్లో తాను పెళ్లి చేసుకోబోయే యువతిపైనే దాడి
  • కాబోయే భార్య ఇంటికి విశ్వనాథ్‌ పదే పదే వస్తున్న యువకుడు
  • గత రాత్రి ఆమె ఇంట్లోనే పడుకుని దాడి
ఇంట్లో అర్ధరాత్రి అందరూ పడుకున్నాక ఓ అమ్మాయి గొంతును బ్లేడుతో కోసేందుకు యత్నించాడు ఓ యువకుడు. కొన్ని రోజుల్లో తాను పెళ్లి చేసుకోబోయే యువతిపైనే అతడు ఈ ఘటనకు పాల్పడడం కలకలం రేపింది. ఈ ఘటన ఒడిశాలోని కొరాపుట్‌ జిల్లా, చింతలగుడ గ్రామంలో జరిగింది.

 సుస్మిత అనే అమ్మాయికి విశ్వనాథ్‌ అనే యువకుడితో గత ఏడాది వివాహం నిశ్చయమైంది. వారిద్దరికి ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి జరగాల్సి ఉంది. కాబోయే భార్య ఇంటికి విశ్వనాథ్‌ పదే పదే వస్తున్నాడు. ఈ క్రమంలో సుస్మిత ఇంటికి వచ్చిన ఆమెకు ముచ్చట్లు చెప్పిన విశ్వనాథ్‌.. గత రాత్రి వారి ఇంట్లోనే పడుకున్నాడు.

అందరూ పడుకున్న తర్వాత మెల్లిగా లేచిన విశ్వనాథ్‌.. సుస్మిత గొంతును బ్లేడుతో కోశాడు. దీంతో  భయంతో ఆమె కేకలు వేసింది.  రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు.
Go Back to Shorts
Odisha
Crime News

More Telugu News