సినీనటుడు ప్ర‌కాశ్ రాజ్‌కు మద్రాసు హైకోర్టు స‌మన్లు.. ఏప్రిల్‌ 2లోగా హాజరవ్వాలని ఆదేశం
Add ap7am to your home Screen

సినీనటుడు ప్ర‌కాశ్ రాజ్‌కు మద్రాసు హైకోర్టు స‌మన్లు.. ఏప్రిల్‌ 2లోగా హాజరవ్వాలని ఆదేశం

 Prakash Raj summoned by the High Court
  • న‌డిగ‌ర్ అనే తమిళ సినిమా నిర్మించిన ప్రకాశ్ రాజ్‌
  • ఓ బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ వద్ద రూ.5 కోట్ల అప్పు
  • ఇటీవల ఆయనకు చెక్‌ ఇచ్చిన ప్రకాశ్‌ రాజ్‌ 
  • బౌన్స్ అవడంతో కేసు 
సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్‌కు చెక్‌బౌన్స్ కేసులో సమన్లు జారీ అయ్యాయి. ఆయన నిర్మించిన న‌డిగ‌ర్ అనే తమిళ సినిమా కోసం ఓ బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఇటీవల ఆయనకు ప్రకాశ్‌ రాజ్‌ చెక్ ఇచ్చారు.

అయితే, ఆ ఫైనాన్సియర్‌ ఆ చెక్‌ను బ్యాంక్‌లో వేయగా బౌన్స్ అవడంతో ఆయన మ‌ద్రాస్ హైకోర్టులో కేసు దాఖ‌లు చేశారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌కి న్యాయ‌మూర్తి స‌మ‌న్లు జారీ చేసి, ఈ కేసులో ఏప్రిల్‌ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించారు. ప్రకాశ్‌రాజ్‌ తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం వంటి పలు భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సినిమాలకు నిర్మాతగానూ వ్యవహరించారు.
Prakash Raj
Tamilnadu

More Telugu News