ఏడాది క్రితం నువ్వేం చేశావు చంద్రబాబూ... గుర్తులేదా?: విజయసాయి రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏడాది క్రితం నువ్వేం చేశావు చంద్రబాబూ... గుర్తులేదా?: విజయసాయి రెడ్డి

Vijayasai Reddy Slams Chandrababu In Twitter
  • గత సంవత్సరం విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ నిర్బంధం
  • నాడు ఏ చట్టం కింద వెనక్కు పంపించావు?
  • ట్విట్టర్ లో చంద్రబాబును ప్రశ్నించిన విజయసాయి
గత సంవత్సరం ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆందోళన చేసేందుకు విశాఖపట్నంకు వచ్చిన వైఎస్ జగన్ ను ఎయిర్ పోర్టు నుంచి ఏ చట్టం కింద తిప్పి పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.

 ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఏం చట్టం కింద నన్ను వెనక్కు పంపుతారని బట్టలు చించుకుంటున్నాడు. ప్రజల మధ్య విష బీజాలు నాటే వారిని వంద సెక్షన్ల కింద లోపలికి నెట్టొచ్చు. ఏడాది కిందట స్పెషల్ స్టేటస్ కోరే ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన జగన్ గారిని, ప్రజా ప్రతినిధులను ఏ చట్టం కింద ఎయిర్ పోర్టు నుంచి తిప్పి పంపావు?" అని అన్నారు.
Jagan
Twitter
Vijay Sai Reddy
Chandrababu

More Telugu News