ఈ ఏడాది ఎండలు భీకరమంటున్న వాతావరణ శాఖ!
- సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే మరింత ఎండ
- 45 డిగ్రీల వరకూ నమోదు కావచ్చు
- ఐఎండీ తాజా నివేదికలో అంచనా
మార్చి రెండో వారం నుంచి ఎండ మంట పెరగడం ప్రారంభం అవుతుందని, మేలో వడగాడ్పులు వీస్తాయని, ఆపై మరింతగా వేడిమి పెరుగుతుందని ఈ రిపోర్టు పేర్కొంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు తాకుతాయని అంచనా వేసింది.
ఈ ఎండ మంటల ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉంటుందని, దక్షిణ కోస్తాలో 45 డిగ్రీల వరకు, రాయలసీమలో 43 నుంచి 44 డిగ్రీల వరకూ వేడిమి నమోదు కావచ్చని ఐఎండీ తెలిపింది.