వైజాగ్ లో థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసిన 'భీష్మ'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైజాగ్ లో థ్యాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసిన 'భీష్మ'

Bheeshma Movie
  • వెంకీ కుడుముల రెండో చిత్రంగా 'భీష్మ'
  • ఈ నెల 29వ తేదీన థ్యాంక్స్ మీట్ 
  • ఉత్సాహాన్ని చూపుతున్న స్టార్ హీరోలు
నితిన్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భీష్మ' ఆదరణ పొందింది. సందేశాన్ని మేళవించి అందించిన వినోదానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నితిన్ కి భారీ విజయాన్ని అప్పగించారు. ఈ నేపథ్యంలోనే ఈ స్థాయి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికిగాను, వైజాగ్ లో 'థ్యాంక్స్ మీట్' ను నిర్వహించడానికి ప్లాన్ చేశారు.

ఈ నెల 29వ తేదీన విశాఖలోని 'గురజాడ కళాక్షేత్రం'లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. రీసెంట్ గా ఈ సినిమా టీమ్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల రెండో సినిమాతోనూ భారీ విజయాన్ని అందుకోవడంతో, ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఆయన తన తదుపరి సినిమాను చరణ్ తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Nithin
Rashmika Mandanna
Bheeshma Movie
Venky Kudumula

More Telugu News