ట్రంప్ కోసం రంగంలోకి దిగిన డిఫెన్స్ యాంటీ డ్రోన్లు!
- నేడు అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటన
- రహదారులన్నీ పోలీసుల అధీనంలోకి
- భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు
రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక యాంటీ డ్రోన్లతో నిఘాను పెట్టారు. వీటిని డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ట్రంప్ పర్యటన ముగిసేంత వరకూ ప్రజలు ఎటువంటి డ్రోన్ లనూ ఎగురవేయరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. మూడు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏడు కంపెనీల క్విక్ రెస్పాన్స్ టీమ్ లు, 15 బాంబు డిటెక్షన్ స్క్వాడ్ లు, పోలీసు జాగిలాలు, ఎస్పీజీ కమాండోలు, ఎయిర్ ఫోర్స్, యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారుల పహారా కొనసాగుతోంది.