చైనాలో కరోనా వైరస్ ప్రబలడంపై హీరో అమీర్ ఖాన్ వ్యాఖ్యలు
- చైనాలో కరోనా వైరస్ మరింత విస్తృతం
- వేల సంఖ్యలో మరణాలు
- వీడియో సందేశం వెలువరించిన అమీర్ ఖాన్
చైనా త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. వైరస్ సోకకుండా అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. చైనాలో ప్రస్తుతం ఎంతో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నా, మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని తెలిపారు. అమీర్ ఖాన్ నటించిన చిత్రాలు చైనాలో కూడా విడుదల అవుతాయి. ముఖ్యంగా, దంగల్ చిత్రంతో ఆయనకు చైనాలోనూ భారీగా అభిమానులు ఏర్పడ్డారు.