కేసీఆర్ భారీ కటౌట్ ఏర్పాటు.. ముషీరాబాద్ ఎమ్మెల్యేకు రూ. 5 వేల జరిమానా

TRS MLA Mutha Gopal fined
  • వీఎస్‌టీ-ఆర్టీసీ కల్యాణ మండపం రోడ్డులో ఏర్పాటు
  • ఫొటో తీసి  సీఈసీ-ఈవీడీఎం ట్విట్టర్‌లో పోస్టు చేసిన వ్యక్తి
  • వెంటనే స్పందించిన అధికారులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని వీఎస్‌టీ-ఆర్టీసీ కల్యాణ మండపం రోడ్డులో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌లో కేసీఆర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావుతోపాటు తన ఫొటోను కూడా ముఠా గోపాల్ ముద్రించుకున్నారు.

 రోడ్డుపక్కనే ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్‌ను చూసిన ఓ వ్యక్తి దానిని ఫొటో తీసి సీఈసీ-ఈవీడీఎం ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. వెంటనే స్పందించిన ఈవీడీఎం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కటౌట్ ఏర్పాటు చేసినందుకు గాను ముఠా గోపాల్‌కు రూ.5 వేల జరిమానా విధించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌కు కూడా ఇటువంటి కటౌట్ ఏర్పాటు విషయంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Go Back to Shorts
KCR
KTR
Mutha Gopal
Hyderabad
TRS

More Telugu News