టీవీ సౌండ్ పెంచాడని.. ఇంటి యజమానిని చంపేసిన కిరాయిదారు!
- పెద్దగా అరుచుకుంటూ గొడవ పడిన దంపతులు
- టీవీ వినిపించకపోవడంతో సౌండ్ పెంచిన యజమాని
- గొడవపడి చేత్తో కొట్టి చంపేసిన నిందితుడు
భార్యతో గొడవపడుతుంటే సౌండ్ పెంచాడన్న కోపంతో ఆయన ఇంట్లోకి వెళ్లిన బాలనర్సయ్య అతడితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో రాజేందర్ తలపై బలంగా కొట్టాడు. అంతే, అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న బాలనర్సయ్య కోసం గాలిస్తున్నారు.