Chandrababu: చంద్రబాబు భద్రతపై ప్రకటన చేసిన డీజీపీ కార్యాలయం

AP DGP Office announces about Chandrababu security

  • చంద్రబాబుకు భద్రత తగ్గించినట్టు వార్తలు
  • దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని కల్పిస్తున్నామన్న డీజీపీ కార్యాలయం
  • 183 మందితో జడ్‌ప్లస్ సెక్యూరిటీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భద్రతకు సంబంధించి ఏపీ డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. చంద్రబాబు భద్రత విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదని, ఆయనకు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. చంద్రబాబు భద్రతను తగ్గించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో డీజీపీ కార్యాలయం ఈ ప్రకటన చేసింది.

సెక్యూరిటీ రివ్యూలో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేశామని, ప్రస్తుతం చంద్రబాబుకు జెడ్‌ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నట్టు వివరించింది. ఆయనకు మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నామని, ఇందులో 135 మందితో విజయవాడలో, 48 మందితో హైదరాబాద్‌లో భద్రత కల్పిస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది.

Chandrababu
DGP office
Andhra Pradesh
Z plus Security
  • Loading...

More Telugu News