అఘోరాగా కనిపించనున్న మంచు మనోజ్
- వైవిధ్యభరితమైన చిత్రంగా 'అహం బ్రహ్మస్మి'
- వచ్చేనెల 6వ తేదీన షూటింగ్ మొదలు
- ఐదు భాషల్లో ఒకే రోజున విడుదల
ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ అఘోరాగా కనిపించనున్నాడనేది తాజా వార్త. సాధారణంగా అఘోరాగా కనిపించడానికి హీరోలు అంతగా సాహసించరు. కానీ మూడేళ్ల విరామం తరువాత వస్తున్న మనోజ్ మాత్రం అఘోరాగా తెరపై కనిపించనున్నాడని అంటున్నారు. ఆయన పాత్రను మలిచిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో ఇంకా ఎలాంటి విశేషాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.