Nagarjuna: 'అన్నమయ్య' హిట్ ను ముందే ఊహించాను: నిర్మాత దొరస్వామిరాజు

  • మేడసాని మోహన్ గారు అన్నమయ్య గురించి చెప్పారు 
  • కథ వినగానే రాఘవేంద్రరావు గారు ఒప్పుకున్నారు 
  • నాకు ఇంత పేరు వస్తుందనుకోలేదన్న దొరస్వామిరాజు
Annamayya Movie

నాగార్జున కథానాయకుడిగా 'కిరాయిదాదా' .. 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం' వంటి మాస్ యాక్షన్ సినిమాలను నిర్మించిన దొరస్వామిరాజు, ఆ తరువాత కాలంలో అదే నాగార్జునతో భక్తిరస ప్రధానమైన 'అన్నమయ్య' సినిమాను నిర్మించారు. నిర్మాతగా ఈ సినిమా ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. " మేడసాని మోహన్ గారు నాకు 'అన్నమయ్య' గురించి చెప్పినప్పుడు సినిమా తీస్తే బాగుండుననిపించింది. ఆ మాటను రాఘవేంద్రరావుగారికి చెప్పగానే వెంటనే అంగీకరించారు. ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోను .. అన్నపూర్ణ స్టూడియోస్ లోను చిత్రీకరించాము. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ఊహించాను. కాకపోతే నాకు ఈ స్థాయిలో పేరు వస్తుందని మాత్రం అనుకోలేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News