ఫిలింఫేర్ అవార్డులు: ఉత్తమ నటుడిగా రణవీర్ సింగ్, ఉత్తమనటిగా అలియా భట్
- గువాహటిలో ఫిలింఫేర్ అవార్డులు
- ఇందిరాగాంధీ స్టేడియంలో కన్నులపండువగా వేడుక
- అత్యధిక అవార్డులు గెల్చుకున్న గల్లీబోయ్ చిత్రం
అంతేకాదు, ఈసారి ఫిలింఫేర్ అవార్డుల్లో 'గల్లీబోయ్' మోత మోగించింది. బెస్ట్ మ్యూజిక్ ఆల్బం, ఉత్తమ సాహిత్యం, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లోనూ 'గల్లీబోయ్' చిత్రానికి అవార్డులు లభించాయి. ఈ చిత్రంలో నటించిన సిద్ధాంత్ చతుర్వేది, అమృతా సుభాష్ ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ సహాయనటి అవార్డులు కైవసం చేసుకున్నారు.