మెట్రో వ్యవహారంలో విషయాలు తెలుసుకుని హుందాగా వ్యవహరిస్తే బాగుంటుంది: కిషన్ రెడ్డికి కర్నె ప్రభాకర్ హితవు
- ఇటీవల జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభం
- కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధానికి నాంది
- స్పందించిన ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్
మెట్రో ప్రారంభోత్సవంలో తాము ప్రోటోకాల్ ను పాటించామని, కానీ కిషన్ రెడ్డి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంలో అర్థంలేదని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఏదైనా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తీసుకురావడంపై దృష్టిపెడితే బాగుటుందని, ఈ విషయంలో ఆయన సఫలమైతే సన్మానం చేసేందుకు కూడా తాము సిద్ధమని కర్నె స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు తమ సొంత రాష్ట్రాలకు నిధులు తీసుకు రావాలని తపించిపోతారని, కానీ కిషన్ రెడ్డిలో ఆ ఛాయలు కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.