సానియా మీర్జా అప్పుడు, ఇప్పుడు... ఓ లుక్కేయండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సానియా మీర్జా అప్పుడు, ఇప్పుడు... ఓ లుక్కేయండి!

  • కొంతకాలం కిందట బరువు పెరిగిన సానియా
  • నాలుగు నెలల్లో ఫిట్ నెస్ సాధన
  • ఇప్పుడెంతో స్లిమ్ గా కనిపిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ క్వీన్
అంతర్జాతీయ టెన్నిస్ రంగంలో భారత్ కీర్తిపతాకను రెపరెపలాడించిన హైదరాబాద్ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా పూర్వవైభవం అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఓ బిడ్డకు జన్మనిచ్చి తల్లైన సానియా మునుపటి స్థాయిలో విజయాలు సాధించేందుకు జిమ్ లో గంటలకొద్దీ గడుపుతోంది. బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో 89 కిలోల బరువున్న సానియా ఇప్పుడు 63 కిలోల బరువుతో స్లిమ్ గా, మరింత ఫిట్ గా తయారైంది. దీనిపై సానియా ఇన్ స్టాగ్రామ్ లో స్పందించింది.

ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు ఉంటాయని, వాటిలో దినసరి లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నా ప్రతిదీ గర్వకారణంలా నిలిచేందుకు శ్రమించాలని సూచించింది. తనవరకు ఒకప్పుడు 89 కిలోలు ఉంటే, బరువు తగ్గాలని భావించి 4 నెలల్లో ఆ లక్ష్యాన్ని చేరుకున్నానని వివరించింది. తల్లిగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ అత్యుత్తమ స్థాయిలో రాణించేందుకు అవసరమైన ఫిట్ నెస్ సాధించేందుకు ఎంతో సమయం పట్టినట్టుగా అనిపిస్తోందని తెలిపింది.

"మీ కలలను నెరవేర్చుకునేందుకు కృషి చేయండి. ఎంతోమంది నిరాశ పర్చేందుకు ప్రయత్నిస్తుంటారు, అలాంటి వారి మాటలు పట్టించుకోవద్దు. మనచుట్టూ అలాంటివాళ్లు ఎంతమంది ఉంటారో దేవుడు చూసుకుంటాడు. ఇది నేను చేయగలను అనుకుంటే ఆ పని మీరు చేయగలరు. మీపై మీరు నమ్మకం ఉంచండి" అంటూ సందేశం వెలువరించింది.
Sania Mirza
Tennis
Hyderabad
India

More Telugu News