ఆర్టీఐ కమిషనర్‌గా 'నమస్తే తెలంగాణ' సంపాదకుడు కట్టా శేఖర్‌రెడ్డి!
- ఆర్టీఐ కమిషనర్ల పదవికి మొత్తం 130 మంది దరఖాస్తు
- వివిధ అంశాల ఆధారంగా 8 మంది ఎంపిక
- నియామకాల కోసం గవర్నర్‌కు సిఫారసు
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ లతో కూడిన కమిటీ నిన్న ప్రగతి భవన్లో సమావేశమై వీరిని ఎంపిక చేసింది. అనంతరం వీరి నియామకాల కోసం గవర్నర్‌కు సిఫారసు చేసింది. కాగా, ఈ పోస్టులకు మొత్తం 130 మంది దరఖాస్తు చేసుకోగా, వివిధ అంశాల ప్రాతిపదికన పై 8 మందినీ ఎంపిక చేశారు.