టీడీపీ ఓటమికి కారణం ఏబీ వెంకటేశ్వరరావే... సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్: కేశినేని నాని!

  • మీరు సీఎం అవడానికి కారణం ఆయనే
  • టీడీపీ ఓటమిలో ప్రధాన భూమిక
  • ట్విట్టర్ లో విజయవాడ ఎంపీ
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణమైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సన్మానిస్తారనుకున్నానని, కానీ సస్పెండ్ చేశారేంటని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "మీరు @ysjagan ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ @YSRCParty అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ @JaiTDP ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!" అని వ్యాఖ్యానించారు. నానీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
Go Back to Shorts
AB Venkateshwara Rao
Jagan
Kesineni Nani
Twitter

More Telugu News