సీసీ కెమెరాల ఏర్పాటులో రికార్డులకెక్కిన తెలంగాణ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీసీ కెమెరాల ఏర్పాటులో రికార్డులకెక్కిన తెలంగాణ!

  • 65 శాతం కెమెరాలు తెలంగాణలోనే
  • ఐదో స్థానంలో ఆంధ్రప్రదేశ్
  • మూడు రాష్ట్రాల్లో ఒక్కటీ లేదు
సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేరాల నియంత్రణతోపాటు నేర పరిశోధనలో కీలకమైన సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నట్టు పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) విడుదల చేసిన ‘డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్’ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏడాది క్రితం వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలుపుకుని మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటు కాగా, వీటిలో 2,75,528 (65 శాతం) కెమెరాలు ఒక్క తెలంగాణలోనే ఉండడం గమనార్హం.

తెలంగాణ తర్వాత 40,112 సీసీ కెమెరాలతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (39,587), మధ్యప్రదేశ్ (21,206) నిలవగా, 14,770 కెమెరాలతో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానానికి పరిమితమైంది. ఇక, 19 రాష్ట్రాల్లో బిగించిన సీసీటీవీ కెమెరాల సంఖ్య వెయ్యి లోపే ఉండగా, ఆరు రాష్ట్రాల్లో వంద కూడా లేవు. ఇక, లక్షద్వీప్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఒక్కటీ లేకపోవడం గమనార్హం.
CCTV
Telangana
Andhra Pradesh
India
BPRD

More Telugu News