పవన్ సినిమాకి 'వకీల్ సాబ్' టైటిల్?
- పవన్ హీరోగా 'పింక్' రీమేక్
- ఉగాది రోజున టైటిల్ ప్రకటన
- మే 15వ తేదీన సినిమా విడుదల
కథాపరంగా ఈ సినిమాకి ముందుగా 'లాయర్ సాబ్' అనే టైటిల్ ను అనుకున్నారు. ఆ తరువాత 'వకీల్ సాబ్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. రీసెంట్ గా ఈ టైటిల్ నే ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. దాదాపు ఈ టైటిల్ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. 'ఉగాది' రోజున ఈ టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. మే 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గతంలో 'గబ్బర్ సింగ్' మే నెలలోనే విడుదలై సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.