'జాన్' టైటిల్ ఖాయమైపోయినట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జాన్' టైటిల్ ఖాయమైపోయినట్టే!

  • ఈ శుక్రవారం విడుదలవుతోన్న 'జాను'
  • 'జాన్' నిర్మాతలను కలిశాను
  • సందేహాలకి తెరదించిన 'దిల్' రాజు 
ప్రభాస్ కథానాయకుడిగా 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రేమ .. పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. యూవీ క్రియేషన్స్ వారితో కలిసి కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ టైటిల్ నే ఖాయం చేస్తారా? వేరేది సెట్ చేస్తారా? అనే సందేహం అభిమానుల్లో వుంది. తాజాగా 'దిల్' రాజు మాటలతో ఆ సందేహానికి తెరపడింది.

'దిల్' రాజు నిర్మించిన 'జాను' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. '96' సినిమాలో కథానాయిక పేరు 'జాను' .. అదే దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా కావడం వలన ఆయన ఆ పేరును టైటిల్ గా పెట్టాడు. ఈ టైటిల్ .. ప్రభాస్ 'జాన్'కి దగ్గరగా ఉండటం వలన నేను ఆ నిర్మాతలను కలిశాను. తమకి అభ్యంతరం లేదని వాళ్లు చెప్పిన తరువాతనే ఖాయం చేసుకున్నాను. 'జాను' టైటిల్ కి దగ్గరగా ఉందని చెప్పేసి వాళ్లు కూడా 'జాన్' టైటిల్ ను మార్చడం లేదు. ఎందుకంటే మా సినిమా తరువాత చాలా కాలానికి 'జాన్' వస్తుంది" అని ఆయన అన్నారు.
Dil Raju
Jaanu Movie
Prabhas

More Telugu News