నేను క్షేమంగానే ఉన్నా.. పుకార్లను నమ్మొద్దు: సునీల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను క్షేమంగానే ఉన్నా.. పుకార్లను నమ్మొద్దు: సునీల్

  • ఇటీవల అనారోగ్యానికి గురైన సునీల్
  • ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పుకార్లు
  • దీంతో మరోసారి వివరణ ఇచ్చిన సునీల్
సినీ నటుడు సునీల్ అనారోగ్య కారణాలతో హైదరాబాదు గబ్బిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో ఇటీవల చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆయన సాధారణ ఫ్లూ జ్వరంతో బాధ పడినట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ సునీల్ సోషల్ మీడియా ద్వారా కూడా ఆయన తెలిపారు. అయినా, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వస్తున్నాయి. దీంతో, ఆయన మరోసారి స్పందించారు.

తాను క్షేమంగానే ఉన్నానని సునీల్ తెలిపారు. తన ఆరోగ్యంపై కొందరు మిత్రులు ఆందోళన చెందుతున్నట్టు తనకు తెలిసిందని... ఈ పుకార్లను ఎవరూ నమ్మవద్దని, తాను షూటింగ్ నిమిత్తం విజయవాడ వచ్చానని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికైనా ఈ పుకార్లకు తెర పడుతుందేమో వేచి చూడాలి.
Sunil
Tollywood

More Telugu News