'దిశ'ను అత్యాచారం చేసి చంపిన 'చెన్నకేశవులు' భార్యతో రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ.. కీలక వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దిశ'ను అత్యాచారం చేసి చంపిన 'చెన్నకేశవులు' భార్యతో రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ.. కీలక వ్యాఖ్యలు

  • ఈమె రేపిస్ట్ చెన్నకేశవులు భార్య
  • 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు
  • అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనిచ్చింది
  • దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'దిశ' అత్యాచారం, హత్య కేసులో దోషి చెన్నకేశవులును పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేసిన విషయం తెలిసిందే. అతడి భార్య (17)తో దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ భేటీ అయ్యారు. పలు అంశాలపై ఆమెతో చర్చించి, కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆమెతో భేటీ అయిన విషయాన్ని వర్మ తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు.  'ఇప్పుడే ఆమెను కలిశాను. ఆమె రేపిస్ట్ చెన్నకేశవులు భార్య. 16 ఏళ్ల వయసులో ఆమెను చెన్నకేశవులు పెళ్లి చేసుకున్నాడు. అతడి బిడ్డకు ఆమె 17 ఏళ్ల వయసులో జన్మనివ్వనుంది. దిశ జీవితాన్నే కాదు అతడు తన భార్యను కూడా బాధితురాలిగా చేశాడు. ఒక చిన్నారి అయ్యుండి ఆమె మరో చిన్నారికి జన్మనిస్తుంది. వారిద్దరికీ మంచి భవిష్యత్తు లేదు' అని రామ్‌ గోపాల్‌ వర్మ తెలిపాడు.

కాగా, దిశ అత్యాచారం, హత్య ఘటనల ఆధారంగా సినిమా చేయబోతున్నానని వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమాకు 'దిశ' అనే టైటిల్‌ను పెట్టారు. నిర్భయ ఘటన తర్వాత కొత్తగా దోషులు ఏం నేర్చుకుంటున్నారో 'దిశ' చిత్రంలో  భయంకరమైన గుణపాఠంగా తెలపబోతున్నామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే చెన్నకేశవులు భార్యను వర్మ తన ఆఫీసులో కలిసినట్లు తెలుస్తోంది.

Disha
Hyderabad
RGV

More Telugu News