కొడుకు ప్రియురాలిపై తండ్రి దారుణం... తాళి కట్టి, అత్యాచారం చేసిన వైనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడుకు ప్రియురాలిపై తండ్రి దారుణం... తాళి కట్టి, అత్యాచారం చేసిన వైనం!

  • కుమారుడి ప్రేమపై తండ్రి పగ
  • యువతిని పిలిపించి మెడలో తాళి
  • ఆపై పలుమార్లు అత్యాచారం
తన అభీష్టానికి వ్యతిరేకంగా, కన్నకొడుకు ప్రేమలో పడ్డాడని తెలుసుకున్న ఓ వ్యక్తి, ప్లాన్ చేసి, సదరు యువతిని పిలిపించి, మెడలో తాళి కట్టి, ఆపై ఇంట్లో బంధించి, రెండు రోజుల పాటు అత్యాచారం చేశాడు. తమిళనాడులోని వేదారణ్యం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ దిగ్భ్రాంతికర ఘటన పూర్వాపరాల్లోకి వెళితే...

వేదారణ్యంలో బట్టల దుకాణం నడుపుకునే నిత్యానందం కుమారుడు ముకేశ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న నిత్యానందం, వారిని విడదీయాలని నిర్ణయించుకున్నాడు. కుమారుడితో పెళ్లి గురించి మాట్లాడటానికి రమ్మని యువతికి కబురు పెట్టాడు. ఆమె వచ్చిన తరువాత, సెల్ ఫోన్ లాక్కుని, మెడలో మంగళసూత్రాన్ని కట్టాడు. ఆపై అత్యాచారం చేశాడు.

రెండు రోజుల పాటు ఆమెను బంధించి, పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఆపై ఆమెను తీసుకెళ్లి, తన స్నేహితుడి ఇంట్లో ఉంచాడు. తన ప్రియురాలిని తండ్రే బంధించాడని తెలుసుకున్న ముకేశ్, తన ప్రియురాలిని రక్షించుకుని, తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసును విచారిస్తున్నారు.
Sun
Love
Lover
Father
Tamilnadu
Police

More Telugu News