రూ. 150 కోట్లు వసూలు చేసినా... నష్టాల్లోనే 'దర్బార్'... రజనీ కనికరించాలంటున్న డిస్ట్రిబ్యూటర్లు!

  • సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం
  • నిర్మాతల లెక్కల ప్రకారం రూ. 150 కోట్ల కలెక్షన్లు
  • తాము నష్టపోయామంటున్న డిస్ట్రిబ్యూటర్లు
ఈ సంక్రాంతి కానుకగా, ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మంచి టాక్ ను తెచ్చుకున్న రజనీకాంత్ 'దర్బార్', తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం నష్టాలనే మిగిల్చిందట. తమను రజనీకాంత్ కనికరించాలని వారంతా కోరాలని నిర్ణయించుకున్నారు. ఎంతో కొంత పరిహారం ఇప్పించాలని కోరుతూ రజనీని కలవాలని పంపిణీదారులు ఎదురు చూస్తున్నారన్న వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, లైకా సంస్థ తమ చిత్రం రూ. 150 కోట్లను వసూలు చేసిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంత భారీ కలెక్షన్లు వచ్చినా, డిస్ట్రిబ్యూటర్లకు నష్టం ఏంటని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు.
Go Back to Shorts
Darbar
Rajanikant
Loss
Movie

More Telugu News