హైదరాబాద్ టైమ్స్ 'మోస్ట్ డిజైరబుల్ ఉమన్' గా శ్రీముఖి

  • బుల్లితెర రంగంలో నెంబర్ వన్ గా శ్రీముఖి
  • హైదరాబాద్ టైమ్స్ ఆన్ లైన్ పోల్  
  • గతేడాది 11వ స్థానంలో నిలిచిన శ్రీముఖి
ఎంతో చలాకీగా యాంకరింగ్ చేస్తూ, నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీముఖి పట్ల యూత్ లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. బిగ్ బాస్-3తో ఆమె హవా మరింత విస్తరించింది. ఈ క్రమంలో హైదరాబాద్ టైమ్స్ మీడియా సంస్థ 'మోస్ట్ డిజైరబుల్ ఉమన్' (బుల్లితెర) గా శ్రీముఖి ఎంపికైంది. 2019కి గాను ఈ గౌరవం దక్కింది. ఆన్ లైన్ పోల్ లో అత్యధికులు శ్రీముఖికే ఓటేశారు.

దీనిపై శ్రీముఖి స్పందిస్తూ, తాను టెలివిజన్ రంగానికి సంబంధించి 'మోస్ట్ డిజైరబుల్ ఉమన్' గా ఎంపికవుతానని అస్సలు ఊహించలేదని తెలిపింది. ప్రతి ఏడాది హైదరాబాద్ టైమ్స్ నిర్వహించే ఈ ఆన్ లైన్ పోల్ ను బాగా ఫాలో అయ్యేదాన్నని, ఎప్పటికైనా గెలవాలని అనుకునేదాన్నని చెప్పింది. ఇప్పుడది నిజం కావడం అద్భుతంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది. కాగా గతేడాది నిర్వహించిన పోల్ లో శ్రీముఖికి 11వ స్థానం దక్కింది.
Go Back to Shorts
Sreemukhi
Most Desirable Woman On TV
Hyderabad Times
Online Poll

More Telugu News