కోర్టుకు హాజరుకాని సీఎం జగన్.. న్యాయస్థానం తదుపరి నిర్ణయం ఏమిటో!
- కచ్చితంగా హాజరు కావాలని గతంలో పేర్కొన్న కోర్టు
- సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన జగన్
- కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం
అయితే సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ తెలంగాణ హైకోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నందునే జగన్ కోర్టుకు హాజరు కాలేదా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.