న్యూయార్క్‌లో భార్యా పిల్లలతో మహేశ్ బాబు షికారు.. అభిమానులను ఆకర్షిస్తోన్న సెల్ఫీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

న్యూయార్క్‌లో భార్యా పిల్లలతో మహేశ్ బాబు షికారు.. అభిమానులను ఆకర్షిస్తోన్న సెల్ఫీ

  • విరామం తీసుకుని ఎంజాయ్‌ చేస్తోన్న మహేశ్
  • కుటుంబ సభ్యులతో న్యూయార్క్‌ వీధుల్లో ఉల్లాసంగా ప్రిన్స్‌
  • సెల్ఫీ తీసిన గౌతమ్
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు ప్రస్తుతం న్యూయార్క్‌లో తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో మూడు నెలల వరకు విరామం తీసుకుంటానని మహేశ్ బాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల తన భార్య నమ్రత పుట్టినరోజును కూడా న్యూయార్క్‌లోనే సెలబ్రేట్‌ చేశాడు.

సినిమాలు, తన కుటుంబమే ప్రపంచంగా బతికే మహేశ్ బాబు తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో తన కుటుంబానికి సంబంధించిన ఫొటోను పోస్టు చేశాడు. మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ తీసిన ఈ సెల్ఫీ అభిమానులను ఆకర్షిస్తోంది. ఇందులో నమ్రత, సితార కూడా ఉన్నారు. 'ఈ సారి... గత వారం.. న్యూయార్క్.. న్యూయార్క్.. కుటుంబంతో..' అంటూ ఆయన పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో న్యూయార్క్‌ వీధుల్లో ఆయన ఉల్లాసంగా పర్యటిస్తున్నాడు. తలకు క్యాప్ తో మహేశ్ బాబు ఈ ఫొటోలో ఉల్లాసంగా కనపడుతున్నారు.
Mahesh Babu
america
new york

More Telugu News