అద్భుతమనిపిస్తున్న మేడారం జాతర ఆహ్వాన పత్రిక... విశేషాలివిగో!

  • మరో వారంలో మేడారం జాతర
  • కానుకలు, విశిష్టతలు తెలిపేలా ఇన్విటేషన్
  • మూడు భాషల్లో ముద్రణ
మరో వారం రోజుల్లో మొదలయ్యే మేడారం జాతరకు ప్రముఖులను ఆహ్వానించేందుకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తయారు చేయించిన ఆహ్వాన పత్రిక అద్భుతమనిపిస్తోంది. దీన్ని చూసిన వారంతా అధికారుల వినూత్న ఆలోచనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. జాతర చరిత్ర, గిరిజనుల సంప్రదాయాలను తెలిపేలా దీన్ని తయారు చేశారు.

ఆహ్వానితులకు బహుమతిగా, గిరిజనులు చిత్రించిన ఓ బొమ్మ, గుర్రం తల (లక్ష్మీ దేవరగా నమ్మే చెక్క బొమ్మ), భక్తులు అత్యంత పవిత్రంగా భావించే కర్రతో తయారు చేసిన కుంకుమ భరిణ (ఇందులో అమ్మవార్ల పసుపు కుంకుమలను నింపి..) జాతర విశేషాలను తెలిపేలా తయారు చేసిన టేబుల్ బుక్ లను కానుకలుగా ఉంచారు.

ఇక ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు కాబట్టి, తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనూ ఆహ్వాన పత్రాలను తయారు చేయించినట్టు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతీ రాథోడ్ వెల్లడించారు. జాతరలో ఏ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో తెలిపేలా సూచికతో పాటు, మేడారంకు ఎలా చేరుకోవాలన్న విషయమై, గూగుల్ మ్యాప్స్ సహకారంతో ఓ క్యూఆర్ కోడ్ ను కూడా ముద్రించామని తెలిపారు. రూట్ మ్యాప్ కూడా ఉంటుందన్నారు.
Go Back to Shorts
Medaram
Jatara
Invitation
Satyavathi Rathore

More Telugu News