నేను వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చాను: పూజ హెగ్డే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చాను: పూజ హెగ్డే

  • పాత్రను గురించి ఆలోచిస్తాను
  • సినిమా ఎలా ఆడుతోందో కనుక్కుంటాను
  • నిర్మాతలు బాగుండాలని భావిస్తాను 
వరుస సినిమాలు .. వరుస విజయాలు పూజ హెగ్డే స్థాయిని అమాంతంగా పెంచేశాయి. ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న 'జాన్' సినిమా విడుదల తరువాత ఆమె క్రేజ్ మరో రేంజ్ కి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో పూజ హెగ్డే మాట్లాడుతూ .. " నా పారితోషికం నాకు అందిందా లేదా అనే విషయాన్ని మాత్రమే కాదు, నా పాత్రకి నేను న్యాయం చేశానా లేదా అనేది కూడా ఆలోచిస్తాను.

అలాగే సినిమా విడుదలైన తరువాత జయాపజయాలతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉండను. ఆ సినిమా ఏ ఏరియాల్లో ఎలా ఆడుతుందో కనుక్కుంటాను. లాభనష్టాలను గురించి తెలుసుకుంటాను. ఎందుకంటే నేను వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చిన దానిని. అందుకే నా నిర్మాతలు బాగుండాలనీ, వాళ్లు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందనే కోణంలో ఆలోచిస్తాను" అని చెప్పుకొచ్చింది. కొంతమంది హీరోయిన్స్ ప్రమోషన్స్ కే రాని ఈ రోజుల్లో పూజ ఇలా ఆలోచిస్తుందంటే గ్రేటే.
Pooaja Hegde
Prabhas
John

More Telugu News