సోనియా గాంధీని వెన్నుపోటు పొడిచాడు: జగన్పై బుద్ధా వెంకన్న విమర్శలు
- రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయ్ ని బలితీసుకున్నాడు
- ఈ ఘటనలకు తెరవెనుక మంత్రాంగం నడిపింది ఏ2 విజయసాయిరెడ్డి గారు
- మూడు ముక్కలాటకి ప్రజలు ఛీ కొట్టడంతో సొంత కార్యకర్తలను రంగంలోకి దింపారు
- ప్రతిపక్ష నాయకుడి దిష్టి బొమ్మలు తగలవెయ్యమని చెప్పారు
'అధికార పార్టీ విధ్వంసం చెయ్యమని సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చింది అంటేనే మూడు రాజధానుల అంశం ఫెయిల్ అయ్యింది అని అర్థమైంది. మూడు ముక్కలాటకి ప్రజలు ఛీ కొట్టడంతో సొంత కార్యకర్తలను రంగంలోకి దింపి ప్రతిపక్ష నాయకుడి దిష్టి బొమ్మలు తగలవెయ్యమని చెప్పి జగన్ స్థాయిని మరింత దిగజారుస్తున్నాడు విజయసాయి రెడ్డి గారు' అని ట్వీట్లు చేశారు.