Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బెజవాడ రౌడీలా ప్రవర్తించాడని ఓ ఎమ్మెల్సీని మెచ్చుకున్నాడు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

  • చంద్రబాబు తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు
  • ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు తెలిసిపోయింది
  • తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు 
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల అంశంపై టీడీపీ నేతల తీరును తప్పుబడుతూ ఆయన ట్వీట్ చేశారు.

'బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
Chandrababu
YSRCP
Vijay Sai Reddy

More Telugu News