భారత్ లో కరోనా వైరస్ ను గుర్తించేందుకు థర్మల్ స్క్రీనింగ్... ఇప్పటివరకు కేసులు లేవన్న కేంద్రం
- చైనాను హడలెత్తిస్తున్న కరోనా వైరస్
- ఇప్పటివరకు 9 మంది మృతి
- భారత్ విమానాశ్రయాల్లో ఆరోగ్య తనిఖీలు
దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రభావం భారత్ లో లేదని వెల్లడించారు. దేశంలోని కీలక విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థ ద్వారా కరోనా వైరస్ బాధితులను గుర్తించే ఏర్పాట్లు చేశామని వివరించారు. చైనాలోని భారత ఎంబసీ నుంచి కూడా తాజా సమాచారం సేకరిస్తున్నామని ప్రీతి సుడాన్ తెలిపారు.