నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన పవన్, బీజేపీ నేతలు
రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసేందుకు తహతహలాడుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. నాదెండ్ల మనోహర్ తో కలిసి ఢిల్లీలో అడుగుపెట్టిన పవన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. పవన్ తో పాటు బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్, పురందేశ్వరి కూడా భేటీ అయ్యారు. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి అంశాల గురించి వారు నిర్మలా సీతారామన్ కు వివరించారు.