వచ్చేనెల నుంచి సెట్స్ పైకి వరుణ్ తేజ్
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
- ప్రతినాయకుడి పాత్రలో సునీల్ శెట్టి
- వచ్చేనెల 17 నుంచి రెగ్యులర్ షూటింగ్
అల్లు బాబీ - సిద్ధూ నిర్మిస్తున్న ఈ సినిమాకి, హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కనిపించనున్నాడు. కొన్ని నెలలుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని మరీ, ఈ సినిమా షూటింగులో వరుణ్ తేజ్ పాల్గొననున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన జోడీ కట్టే కథానాయికల విషయంలో క్లారిటీ రావలసి వుంది.