నవ్వడం తెలియదు.. ఏడుపు ముఖంతోనే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నారు
- ఇప్పుడు జోలె పట్టుకుని అడుక్కుంటున్నారు
- వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో చెప్పండి
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు జోలె పట్టుకుని అడుక్కుంటున్నారని అన్నారు. కార్పొరేషన్ డబ్బులను ఎన్నికల స్టంట్ కోసం ఖర్చు చేశారని చెప్పారు. ఏడుపు ముఖంతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. పొత్తు లేనిదే మీకు ముద్ద కూడా దిగదని ఎద్దేవా చేశారు. వైసీపీ సింగిల్ గానే వెళ్తుందని చెప్పారు.