మళ్లీ సంక్రాంతికి ఎన్టీఆర్ తో రానున్న త్రివిక్రమ్
Add ap7am to your home Screen

మళ్లీ సంక్రాంతికి ఎన్టీఆర్ తో రానున్న త్రివిక్రమ్

  • గతంలో హిట్ చిత్రంగా నిలిచిన 'అరవింద సమేత'
  • ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమాకి సన్నాహాలు 
  • ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి  
'అరవింద సమేత' తరువాత త్రివిక్రమ్ తో మరో సినిమాను చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపుతున్నాడు. అలాగే ఎన్టీఆర్ తనకి ఇస్తున్న ప్రాముఖ్యతను బట్టి, ఆయనతో సినిమా చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కి ఆయన ఒక లైన్ వినిపించడం .. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. అయితే ఈ సినిమా ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళ్లొచ్చు అనే ఆసక్తిని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

 పూర్తి స్క్రిప్ట్ ను ఏప్రిల్ నాటికి సిద్ధం చేసుకుని, సెట్స్ పైకి వెళ్లేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. ఈ కథలో యాక్షన్ పాళ్లు తక్కువ .. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాదాపు జంధ్యాల సినిమాలను గుర్తుచేసేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. ఈ నెలలోనే ఈ ప్రాజెక్టును గురించిన అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
Ntr
Trivikram

More Telugu News