ఆయన నాలుగు సార్లు సీఎం అయినప్పుడు... నేను నాలుగు సార్లు డిప్యూటీ సీఎం ఎందుకు కాకూడదు?: అజిత్ పవార్
- సొంత చిన్నాన్నపై అజిత్ పవార్ చలోక్తులు
- ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నవ్వులు కురిపించిన అజిత్
- 15 ఏళ్లలో నాలుగు సార్లు డిప్యూటీ సీఎం అయిన అజిత్
గత 15 ఏళ్ల కాలంలో అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా నాలుగు సార్లు బాధ్యతలను స్వీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఆయన రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఫడ్నవిస్ ప్రభుత్వంలో డిప్యూటీగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు.