ఇవాళ అమరావతిని మోసం చేసినవాళ్లు రేపు విశాఖను మోసం చేయరని నమ్మకం ఏంటి?: చంద్రబాబు
- భీమవరంలో చంద్రబాబు ప్రసంగం
- పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి జేఏసీ యాత్ర
- పోలీసులు బలిపశువులుగా మారుతున్నారన్న చంద్రబాబు
రాజధానిని తరలిస్తోంది విశాఖ ప్రజలపై అభిమానంతో కాదని, అక్కడి భూములపై వైసీపీ కన్నుపడినందునే రాజధాని మార్పు జరుగుతోందని ఆరోపించారు. ఇవాళ అమరావతి ప్రజలను మోసం చేసినవాళ్లు రేపు విశాఖ ప్రజలను మోసం చేయరన్న నమ్మకం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. మహిళలపై దాడులు చేయిస్తూ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని, జగన్ కోసం పోలీసులు బలిపశువులుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని యువత కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.