రాజకీయాల్లో క్లారిటీ అన్నది లేని వ్యక్తి పవన్: మంత్రి బొత్స
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి బొత్స నారాయణ విమర్శలతో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో క్లారిటీ అన్నది లేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. రాజకీయ ఉనికి కోసమే బీజేపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయని ధ్వజమెత్తారు. మంత్రి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. 2024లో అధికారంలోకి వస్తామని చెప్పడానికి పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణలు ఏమైనా జ్యోతిష్యులా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు కలవడం, విడిపోవడం సహజమే అని ఆయన వ్యాఖ్యానించారు.