'ఎంత మంచివాడవురా' తొలిరోజు వసూళ్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎంత మంచివాడవురా' తొలిరోజు వసూళ్లు

  • నిన్ననే విడుదలైన 'ఎంత మంచివాడవురా'
  • తొలిరోజునే ఈ సినిమాకి పాజిటివ్ టాక్
  • వీకెండ్ వరకూ వసూళ్లకు ఢోకా లేనట్టే  
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన 'ఎంత మంచివాడవురా' సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వైపున 'సరిలేరు నీకెవ్వరు' హిట్ టాక్ తెచ్చుకుంది. మరో వైపున 'అల వైకుంఠపురములో' సినిమా కూడా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్ రంగంలోకి దిగడం అంత కరెక్ట్ కాదేమోనని అనుకున్నారు.

కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సంబంధించిన కంటెంట్ తో వచ్చిన కల్యాణ్ రామ్ మంచి మార్కులే కొట్టేశాడు. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజునే 4 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. కల్యాణ్ రామ్ కి గల ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇవి మంచి వసూళ్లేనని అంటున్నారు. ఈ వీకెండ్ వరకూ ఈ సినిమా వసూళ్లకు ఢోకా ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఏడాది ఆరంభంలోనే కల్యాణ్ రామ్ కి మంచి సినిమా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Kalyan Ram
Mehreen

More Telugu News