రెండెకరాల స్థలంలో అతి పెద్ద 'గులాబీ కారు' ముగ్గు.. అబ్బుర పరుస్తున్న రంగవల్లిక ఫొటో

  • మునిసిపల్ ఎన్నికలు, సంక్రాంతి నేపథ్యంలో కారు ముగ్గు
  • సిరిసిల్లలో ఆకర్షిస్తోన్న ముగ్గు
  • రంగవల్లిక వేసిన 200 మంది టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు
సంక్రాంతి అంటే గాలి పటాలు, పిండివంటలు, మందిరాల్లో పూజలు మాత్రమే కాదు... రంగురంగుల ముగ్గులు కూడా. తమ ఇంటి ముందు ఆకర్షణీయ ముగ్గులు వేయడంలో నిన్న రాత్రి నుంచి మహిళలంతా బిజీ అయిపోయారు. కొన్ని ప్రాంతాల్లో ముగ్గుల పోటీలు కూడా పెట్టారు. కాగా, టీఆర్‌ఎస్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా కార్యకర్తలు రెండెకరాల స్థలంలో వేసిన అతి పెద్ద ముగ్గు అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది.

టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు వేసిన ఇంతటి పెద్ద ముగ్గుని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. సంక్రాంతి సంబురాలు, మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం ఒకే సమయంలో వచ్చిన  నేపథ్యంలో ఈ భారీ కారు ముగ్గును వేశారు. ప్రచారంతో పాటు తమ ముగ్గు కళను ప్రదర్శించారు. ఈ ముగ్గుని 200 మంది టీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు వేశారు.
Go Back to Shorts
TRS
Telangana
car

More Telugu News